‘సామీ స్క్వేర్’ ట్రైలర్ విడుదల ఎప్పుడంటే !

హీరో చియాన్ విక్రమ్,కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సామీ స్క్వేర్’.”ఈ చిత్ర తమిళ మోషన్ పోస్టర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇప్పటివరకు ఈ టీజర్ 3 మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్ర తమిళ ట్రైలర్ ఈ నెల 26 న రిలీజ్ కానుంది. యాక్షన్ చిత్రాల దర్శకుడు హరి ఈ సినిమాను తెరకెక్కిస్తుండడంతో తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం ఫై మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయకిగా నటిస్తోంది. తమీన్స్ ఫిలిమ్స్ పతాకం ఫై శిబు తమీన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర తెలుగు మోషన్ పోస్టర్ ఈ రోజు సాయత్రం 6:00 గంటలకి రిలీజ్ కానుంది .

Exit mobile version