అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న చిత్రాల్లో దాదాపుగా పూర్తైన సినిమా ‘సవ్యసాచి’. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. సినిమాకు సంబదించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దీంతో చిత్ర టీమ్ ఫస్ట్ లుక్ టీజర్ ను సిద్ధం చేస్తున్నారట.
జూలై నెల మొదటి వారంలో ఇది విడుదలయ్యే అవకాశాలున్నట్టు సమాచారం. మరి ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి నిధి అగర్వాల్ కథానాయకిగా కనిపించనుంది. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం ‘బాహుబలి’ లాంటి సినిమా కోసం పనిచేసిన మకుట సంస్థ పనిచేస్తోంది. ఇందులో మాధవన్, భూమికా చావ్లా వంటి సీనియర్ నటీ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


