యువ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల !

యువ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల !

Published on Mar 28, 2018 5:11 PM IST

‘కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి బ్లాక్ బస్టర్లు తీసి మేకింగ్లో తన భిన్నత్వాన్ని చాటుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గత రెండు చిత్రాలు ‘ముకుంద, బ్రహ్మోత్సవం’లు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయాయి. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న ఆయన ఈసారి యూత్ ఫుల్ కథతో ప్రేక్షకుల ముందుకురానున్నారట.

ఈ కథలో ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్న యువ హీరో ఒకరు నటిస్తారని, ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని వినికిడి. ఈ సినిమాలో కూడ అడ్డాల గత సినిమాల్లో ఉన్నట్టే కుటుంబపరమైన ఎమోషన్స్ ఎక్కువగానే ఉంటాయట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్టులో నటించబోయే ఆ యువ హీరో ఎవరు, ఇతర విశేషాలేమిటి అనేది తెలుసుకోవాలంటే 123తెలుగును ఫాలో అవ్వండి.

తాజా వార్తలు