విశాల్ – సుందర్ సి మూవీ అప్డేట్ !

Published on Apr 17, 2019 3:52 pm IST

యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం సుందర్ సి డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. టర్కీ లో ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం బోయింగ్ విమానాన్ని కూడా వాడుతున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుంది.

ఇక ఈ చిత్రం తరువాత విశాల్ , ఆనంద్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. జూన్ నుండి ఈ చిత్రం స్టార్ట్ కానుంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నాడని సమాచారం. అయితే ఈచిత్రం విశాల్ అల్ టైం సూపర్ హిట్ మూవీ ‘ఇరుంబు తిరై ‘ కి సీక్వెల్ అని వస్తున్న వార్తల్లో నిజం లేదట. విశాల్ సొంత బ్యానేర్ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

సంబంధిత సమాచారం :