ఇంట్రస్టింగ్ సబ్జెక్టు తో విజయ్ 63 !

ఇంట్రస్టింగ్ సబ్జెక్టు తో విజయ్ 63 !

Published on Dec 9, 2018 11:00 PM IST

ఇటీవల సర్కార్ తో ప్రేక్షకులముందుకు వచ్చి బాక్సాఫిస్ వద్ద సత్తాచాటిన తమిళ స్టార్ హీరో విజయ్ తన కొత్త చిత్రంలో నటించడానికి సన్నద్ధం అవుతున్నాడు. యువ దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఇక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో అందులోవుండే పాలిటిక్స్ ను బేస్ చేసుకొని ఈ స్టోరీ ఉండనుందని సమాచారం. ఈ చిత్రంలో విజయ్ కోచ్ పాత్రలో కనిపించనున్నాడట అందుకోసం ప్రస్తుతం ఆయన ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు.

ఎఆర్ రెహమాన్ సంగీతం అందించనున్న ఈచిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయిక నటించనుంది. భారీ బడ్జెట్ తో ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదలకానుంది. జనవరి నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు