
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాని ఆర్.ఎస్.ఎస్ బ్యానర్ పై ఆర్. శ్రీనివాస్ కన్నడలో డిస్ట్రిబ్యూట్ చేసాడు. ఆ సినిమా కర్ణాటకలో పెద్ద హిట్ అయ్యి అక్కడ బాగా లాభాలు తెచ్చి పెట్టడంతో శ్రీనివాస్ వరుసగా తెలుగు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయడంలో అమితంగా ఆసక్తి కనబరుస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా కన్నడ సూపర్ స్టార్ నటంచిన సినిమా ‘ఉపేంద్ర 2’. ఆగష్టు 14న ఈ సినిమా కన్నడ, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది. నల్లమలపు బుజ్జి ‘ఉపేంద్ర 2’ సినిమా తెలుగు వెర్షన్ కి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబందించిన ఇరు రాష్ట్రాల రైట్స్ (ఆంధ్రప్రదేశ్ + తెలంగాణ)ని శ్రీనివాస్ ఓ బంపర్ ప్రైజ్ ఇచ్చి సొంతం చేసుకున్నాడు.
తన సినిమాకి సంబందించిన ఇరు రాష్ట్రాల రైట్స్ ని శ్రీనివాస్ తీసుకోవడమే కాకుండా గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండడంతో హీరో ఉపేంద్ర చాలా హ్యాపీగా ఉన్నాడు. ఉపేంద్ర సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాకి ప్రేక్షకులలో కూడా బాగానే క్రేజ్ ఉంది. దానివలన ఓపెనింగ్స్ బాగా వస్తాయని శ్రీనివాస్ భావిస్తున్నాడు. శ్రీనివాస్ ఈ సినిమాతో పాటు టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ అయిన రుద్రమదేవి, కిక్ 2 సినిమాలను కూడా కన్నడలో డిస్ట్రిబ్యూట్ చేయనున్నాడు. అలాంటి శ్రీనివాస్ ఉపేంద్ర 2 ని ఆంధ్ర, తెలంగాణలో రిలీజ్ చేస్తుండడంతో నల్లమలపు బుజ్జి కూడా హ్యాపీగా ఉన్నాడు. ఉపేంద్రనే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో క్రిస్టినా అఖీవా, పరుల్ యాదవ్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు.

