విశాఖ వేదికగా ఉపేంద్ర నటించిన “ఐ లవ్ యూ” ఆడియో వేడుక

విశాఖ వేదికగా ఉపేంద్ర నటించిన “ఐ లవ్ యూ” ఆడియో వేడుక

Published on May 29, 2019 3:19 PM IST

కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర నటించిన తాజా సినిమా ‘ఐ లవ్ యు’. ‘నన్నే… ప్రేమించు’ అనేది క్యాప్షన్‌. రచితా రామ్‌ హీరోయిన్ గా చేస్తుండగా దర్శకుడు ఆర్‌. చంద్రు శ్రీ సిద్ధేశ్వరా ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ట్రైలర్ విడుదల కార్యక్రమానికి ‘ఈగ’ ఫేమ్ సుదీప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.వీరితో పాటు కర్ణాటక విద్యాశాఖ మంత్రి జిటి దేవెగౌడ, మాజీ మంత్రి హెచ్.ఎం. రేవణ్ణ, వైఎస్సార్‌సీపీకి చెందిన‌ ఏపీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు.

ఐ లవ్ యూ మూవీ దర్శక నిర్మాత అయిన ఆర్. చంద్రు ఈ మూవీ తెలుగు పాటల వేడుకను విశాఖపట్నంలో సాగర తీరాన ఘనంగా ఘనంగా నిర్వహించనున్నారని తెలిపారు. ‘ఐ లవ్ యు’ ప్రీ రిలీజ్ ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ఫస్ట్ ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయింది. జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా 1000 స్క్రీన్లలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

సోను గౌడ, బ్రహ్మానందం, హోనవళ్ళి కృష్ణ, జై జగదీష్‌, పీడీ సతీష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి రచన, నిర్మాణం, దర్శకత్వం ఆర్‌. చంద్రు. కిరణ్ తోటంబైల్ సంగీతం సమకూరుస్తుండగా, సినిమాటోగ్రఫర్ గా సుజ్ఞాన్, ఎడిటర్‌గా దీపు ఎస్‌. కుమార్‌ వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు