మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ అలాగే యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ప్రేమకథా చిత్రం “ఉప్పెన”. గత వారం విడుదల కాబడిన ఈ చిత్రం మొదటి రోజు నుంచి కూడా రికార్డు స్థాయి వసూళ్లతో ఏ డెబ్యూ చిత్రంకు రాని వసూళ్లను ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది.
మరి ఇదిలా ఉండగా మొదటి వారాంతం పూర్తయ్యి అసలు టెస్ట్ లోకి కూడా ఈ చిత్రం అడుగు పెట్టింది. అదే ఈ సోమవారం వర్కింగ్ డే. ఈ రోజున కూడా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా స్ట్రాంగ్ వసూళ్లు రాబట్టినట్టుగా పి ఆర్ టీమ్ చెప్తున్నారు. ఈ చిత్రానికి నాలుగో రోజు సోమవారం వరల్డ్ వైడ్ గా 5.35 కోట్ల షేర్ ను రాబట్టినట్టు తెలుస్తుంది. ఇక ఏరియాల వారీగా వసూళ్లను చూసినట్టు అయితే..
నైజాం – 1.35 కోట్లు
సీడెడ్ – 82 లక్షలు
వైజాగ్ – 78 లక్షలు
తూర్పు – 48 లక్షలు
పశ్చిమ – 20.50 లక్షలు
కృష్ణ – 25 లక్షలు
గుంటూరు – 34 లక్షలు
నెల్లూరు -15 లక్షలు
రెండు తెలుగు రాష్ట్రాలలో 4వ రోజు మొత్తం – 4.6 కోట్లు షేర్
కర్ణాటక – 25 లక్షలు
చెన్నై – 10 లక్షలు
మిగతా ఇండియా మొత్తం – 10 లక్షలు
ఓవర్సీస్ – 30 లక్షలు
మొత్తం – 75 లక్షలు.
ఇలా ఓవరాల్ గా 4వ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉప్పెనకు 5.35 కోట్ల షేర్ వచ్చింది. మరి ఫైనల్ గా కూడా ఈ చిత్రం అద్భుతమైన మార్క్ సెట్ చెయ్యడం ఖాయం అనిక్ చెప్పాలి.


