‘ధృవ్’ సినిమాలో ఉప్పెన భామ !

Published on Mar 7, 2021 10:33 pm IST

తమిళ స్టార్ చియాన్ విక్రమ్ కుమారుడు ‘ధృవ్’, ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ తో తమిళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. క్యారెక్టర్ కోసం బాడీని ఎలాగైనా మార్చుకోగలిగిన నేర్పు తండ్రి నుండి పుణికిపుచ్చుకున్నట్టు ఉన్నాడు. మొదటి సినిమాతోనే వేరియేషన్స్ చూపిస్తూ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా బాగా పేరు తెచ్చుకున్నాడు. ఇక తన తరువాత సినిమాల కోసం ఇప్పటికే రెండు స్క్రిప్ట్స్ ను లైన్ లో పెట్టిన ఈ యంగ్ హీరో, ఏప్రిల్ నుండి కొత్త సినిమాని స్టార్ట్ చేయనున్నాడట.

కాగా మురగదాస్ అసిస్టెంట్ రవికాంత్ అనే కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో సినిమాని చేయబోతున్నాడట. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా సెన్సేషన్ బ్యూటీ కృతి శెట్టిను తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఉప్పెన పుణ్యమా అని ఓవర్ నైట్ లోనే ఫుల్ క్రేజ్ సంపాదించిన కృతి శెట్టికి, ప్రస్తుతం మంచి ఆఫర్లు వస్తున్నాయి.

సంబంధిత సమాచారం :