ఆ భారీ డీల్ కు నో చెప్పిన “ఉప్పెన” టీం.?

Published on May 23, 2020 3:00 am IST

ప్రస్తుత లాక్ డౌన్ కారణంగా విడుదలకు నోచుకోని సినిమాలలో ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రం “ఉప్పెన”. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన బుచ్చిబాబు సన దర్శకత్వంలో మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ ను హీరోగా కృతి శెట్టిని హీరోయిన్ గా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

వీరితో పాటు దర్శకునికి కూడా ఇది డెబ్యూ మోవి కావడం అందులోను ఇప్పటికే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటలు అన్ని హిట్ కావడంతో ఈ చిత్రంపై మంచి పాజిటివ్ హైప్ ఏర్పడింది. అలా మొత్తం సినిమా విడుదలకు ఆల్ సెట్ అనుకునే సమయంలో ఈ లాక్ డౌన్ అడ్డు పడింది.

ఇదే సమయంలో ఇతర ఇండస్ట్రీలలో సినిమాలు ఓటిటి సంస్థలకు అమ్మడం మొదలు పెట్టిన నేపథ్యంలో ఈ చిత్రానికి కూడా ఓ ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నుంచి మంచి ఆఫర్ వచ్చిందట. ఈ చిత్రానికి దాదాపు 14 కోట్లు ఓ ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ ఆఫర్ చెయ్యగా దానిని ఈ చిత్ర యూనిట్ తిరస్కరించారని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని థియేటర్స్ లోనే విడుదల చేస్తామని వారు వారు క్లియర్ చేసినట్టుగా వినికిడి.

సంబంధిత సమాచారం :

More