లక్కీ డేట్ కోసం చూస్తున్న మెగా హీరో

Published on Mar 21, 2020 1:00 am IST

మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న మరొక హీరో వైష్ణవ్ తేజ్. ఆయన మొదటి చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. అన్ని పనుల్ని పూర్తి చేసుకున్న ఈ సినిమాను మొదట ఏప్రిల్ 2వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా వైరస్ ప్రభావంతో సినిమాలన్నీ వాయిదాపడటంతో ఈ చిత్రాన్ని కూడా వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట.

అలాగే కొత్త తేదీ విషయంలో కూడా సెంటిమెంట్ ఫాలో అవుతున్నారట టీమ్. సినిమాను వీలైనంతవరకు మే 7న విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఎందుకంటే అదే రోజున 2004లో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘ఆర్య’ విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అందుకే అదే రోజున ఈ చిత్రాన్ని విడుదలచేస్తే బాగుంటుందనే ఆలోచనలు నడుస్తున్నాయట. మరి చివరికి అదే తేదీని ఫైనల్ చేస్తారో లేకపోతే వేరే డేట్ ఎంచుకుంటారో చూడాలి.

సంబంధిత సమాచారం :