“ఉప్పెన” ట్రైలర్..అన్ని భావోద్వేగాల సమ్మేళనం.!

Published on Feb 4, 2021 4:38 pm IST

మన తెలుగులో కొంత మంది డెబ్యూ హీరో సినిమాలకు మాత్రమే అమితమైన క్రేజ్ వచ్చింది అలాంటి లిస్ట్ లో ఖచ్చితంగా మెగా నూతన హీరో పంజా వైష్ణవ్ తేజ్ కూడా ఒకడు. పాటలు పోస్టర్స్ నుంచి సినిమా విడుదల సమయానికి మంచి అంచనాలు బిజినెస్ ఈ చిత్రం ఏర్పర్చుకున్న సంగతి తెలిసిందే. దీనితో అన్ని వర్గాల్లో మంచి మోస్ట్ అవైటెడ్ సినిమాగా నిలిచిన ఈ చిత్రం నుంచి అంతే మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఇప్పుడు బయటకు వచ్చింది.

ఇక దీనిని చూసినట్టయతే ఇది వరకు మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గానే అనుకున్నాం కానీ దానితో పాటు బలమైన భావోద్వేగాలు కూడా ఇందులో కనిపిస్తున్నాయి. ప్రేమ, పగ, పరువు అన్ని కలగలిపి దర్శకుడు బుచ్చిబాబు ప్రెజెంట్ చేసినట్టు అనిపిస్తుంది. అలాగే వైష్ణవ్ కూడా చాలా సెటిల్డ్ గా కనిపిస్తున్నాడు. కృతి కూడా కనిపించిన ప్రతీ ఫ్రేమ్ లో బాగా కనిపించి ఆకట్టుకుంది.అయితే ఇందులో ముఖ్యంగా మాట్లాడాల్సింది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కోసం.

ఇది వరకే మాస్టర్ లో విలన్ గా కనిపించి మెస్మరైజ్ చేసి ఇందులో ఏకంగా హీరోయిన్ తండ్రి పాత్ర ఒప్పుకోవడం దానిని అంతే స్ట్రాంగ్ గా చెయ్యడం హర్షణీయం. దీనితో ఈ సినిమాలో సేతుపతి రోల్ అదిరేలానే అనిపిస్తుంది. అలాగే ఈ ట్రైలర్ లో డైలాగ్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఎండింగ్ లో ప్రేమ కోసం సేతుపతి చెప్పే డైలాగ్ టచ్చింగ్ గా అనిపిస్తుంది. కానీ అతనికి డబ్బింగ్ మారిస్తే బాగుండేది.

అయితే ఓవరాల్ గా కాస్త రొటీన్ స్టఫ్ ఏమో అన్న డౌట్ కూడా వస్తుంది..కానీ సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి. ఈ ట్రైలర్ లో మరో స్పెషల్ మెన్షన్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ సైనుద్దీన్ వర్క్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆ విజువల్స్ కానీ చాలా బాగున్నాయి. మరి అన్ని ఎమోషన్స్ ను కలగలుపుకొని వస్తున్న ఈ “ఉప్పెన” థియేటర్స్ లో ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ ఫిబ్రవరి 12 వరకు ఆగాల్సిందే.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :