యూరి కాంబినేషన్ లో మరో మూవీ !

Published on Apr 18, 2019 9:00 am IST

బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ నటించిన యూరి :ది సర్జికల్ స్ట్రైక్ ఇటీవల విడుదలై హిందీలో ఈఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ హిట్ గా రికార్డు సృష్టించిది. 2016 లో భారత సైన్యం పాక్ మిలిటెంట్ల ఫై జరిపిన సర్జికల్ స్ట్రైక్ ను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ఈచిత్రం ఒక్క ఇండియాలోనే 250కోట్ల వసూళ్లను రాబట్టింది. నూతన దర్శకుడు ఆదిత్య దార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రోనీ స్క్రివెలా నిర్మించారు.

ఇక ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో మరో సినిమా రానుంది. ఈచిత్రం యొక్క మేజర్ పార్ట్ షూటింగ్ అంతా విదేశాల్లో జరుగనుంది. భారీ విఎఫ్ఎక్స్ తో యాక్షన్ బేస్డ్ సూపర్ హీరో ఫిలిం గా తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :