బాలయ్య పిలుపు కోసం బోయపాటి ఎదురు చూపులు !

Published on Jul 1, 2019 8:39 am IST

మొత్తానికి నందమూరి బాలకృష్ణ సూచన మేరకు బోయపాటి శ్రీను స్క్రిప్ట్ పనులను పూర్తి చేశాడు. కానీ వీరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో ఉంటుందో ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు. ఎప్పుడో మొదలవ్వాల్సిన సినిమా హై బడ్జెట్ కారణంగా పోస్ట్ ఫోన్ అయింది. చివరికి 60 కోట్లు బడ్జెట్ ను బోయపాటి 40 కోట్లకు కుదించినా సినిమా ఎప్పుడు ఉంటుందో ఇంకా తెలియని పరిస్థితి. అయితే బాలయ్య సూచన మేరకు బోయపాటి కథలో మార్పులు చేసాడట. కాగా స్క్రిప్ట్ లో చేసిన మార్పులు గురించి ఇప్పటికే బాలయ్యకి కూడా వినిపించినట్లు తెలుస్తోంది.

కానీ బాలయ్య లేటెస్ట్ వర్షన్ పై ఎలాంటి కామెంట్లు చేయలేదట. బాగుందా..? లేక, బాగాలేదా..? అనే విషయం కూడా ఇంకా బాలయ్య చెప్పలేదట. దాంతో సినిమా వదులుకోవాలా.. ? లేక బాలయ్య పిలుపు కోసం ఎదురు చూడాలో..? అని అర్ధం కానీ పరిస్థితుల్లో ఉన్నాడట బోయపాటి. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. అలాగే ఈ కాంబినేషన్ ఈ సారి హిట్ అవుతుందో లేదో కూడా చూడాలి. హిట్ అయితే మాత్రం బాలయ్య – బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొట్టినట్లే.

సంబంధిత సమాచారం :

More