‘ఎన్టీఆర్’ బాలయ్య మనవళ్ళకు మాత్రమే.. !

Published on Apr 16, 2019 7:00 pm IST

మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్స్ ఆశించిన స్థాయిలో కలెక్షన్లను మాత్రం రాబట్టలేకపోయాయి. అయితే తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు ‘నారా దేవాన్ష్’, ‘మహానాయకుడు’లో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో నటించాడు. అలాగే ‘కథానాయకుడు’లో బాలయ్య చిన్న కూతురి కుమారుడు ‘ఆర్యవీర్’ బాలయ్య చిన్నప్పటి పాత్రలో నటించాడు. మొత్తానికి ‘నారా దేవాన్ష్’, ‘ఆర్యవీర్’లు మొదటి సారి స్క్రీన్ పై కనిపించినా నందమూరి అభిమానులను బాగానే అలరించారు.

అయితే ఎన్టీఆర్ బయోపిక్, ఎన్టీఆర్ ను ఎంతవరకూ గుర్తు చేసిందో, అలాగే టీడీపీకి ఎంతవరకు ఉపయోగపడిందో తెలియదు గాని, బాలయ్య మనవళ్ళ సినీ ఎంట్రీకి మాత్రం బాగా ఉపయోగబడిందని.. ఆ మాట కొస్తే బాలయ్య మనవళ్ళకు మాత్రమే ఎన్టీఆర్ బయోపిక్ బాగా ఉపయోగపడిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :