త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “ఊర్వశివో రాక్షసివో”

Published on Mar 19, 2023 9:33 pm IST


టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్ హీరోగా డైరెక్టర్ రాకేష్ శశి దర్శకత్వం లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఊర్వశివో రాక్షసివో. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఊహించిన రీతిలో వసూళ్లను రాబట్టడం లో విఫలం అయ్యింది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అవుతోంది.

త్వరలో ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమిని టీవీ లో ప్రసారం కానుంది. శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ మరియు GA2 పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా లో అను ఇమ్మన్యూయేల్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :