
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించడమే కాకుండా స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ నిర్మించిన సినిమా ‘ఉత్తమ విలన్’. రమేష్ అరవింద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందు ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఎట్టకేలకు మే నెలలో విడుదలై కమల్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఒక ప్రయోగాత్మక కథను తెరకెక్కించినందుకు కమల్‌కు ఈ సినిమా తర్వాత ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రమ్ సినిమా అనుకున్నంత బాగా సక్సెస్ కాలేకపోయింది.
కాగా ఈ సినిమా లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్‌లో ఏకంగా ఐదు అవార్డులు కొట్టేసి మళ్ళీ విశేషంగా నిలిచింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు (కమల్ హాసన్), ఉత్తమ సంగీత దర్శకుడు (గిబ్రాన్), ఉత్తమ పాట (గిబ్రాన్), ఉత్తం సౌండ్ డిజైన్ (కునాల్ రాజన్) ఇలా ఐదు విభాగాల్లో ఉత్తమ విలన్ అవార్డులను సొంతం చేసుకోవడం ఆసక్తికరంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా తర్వాత తన క్రేజ్‌ను అమాంతంగా పెంచేసుకున్న గిబ్రాన్, తమ సినిమా ఈ స్థాయి ప్రతిభ చూపడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.