‘ఉత్తమ విలన్’ సడన్ షోస్ కి కూడా సూపర్ కలెక్షన్స్

‘ఉత్తమ విలన్’ సడన్ షోస్ కి కూడా సూపర్ కలెక్షన్స్

Published on May 3, 2015 7:32 PM IST

Uttamavillain
ఎప్పటికప్పుడు డిఫరెంట్ స్టోరీస్ తో ప్రేక్షకులను మెప్పించే స్టార్ హీరో ఉలగనాయగన్ కమల్ హాసన్ చేసిన మరో ప్రయోగమే ‘ఉత్తమ విలన్’. ప్రతిసారి లానే ఈ సారి కూడా కమల్ హాసన్ ఉత్తమ విలన్ సినిమా రిలీజ్ కష్టాలను ఫేస్ చేసింది. మే 1న అనగా గత శుక్రవారం రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఫైనాన్సియల్ ఇబ్బందుల వలన ఒకటిన్నర రోజు ఆలస్యంగా రిలీజ్ అయ్యింది. అనగా శనివారం సాయంత్రం ఫస్ట్ షోస్ తో అన్ని చోట్లా షోస్ పడ్డాయి. ఇలా ఇదిగో షో అదిగో షో అంటూ వాయిదా పడుతూ వచ్చిన ఉత్తమ విలన్ షోస్ సడన్ గా మొదలయ్యాయి.

ఉన్నపళంగా రాత్రి నుంచి షోస్ స్టార్ చేస్తే ప్రేక్షకులకి రీచ్ అవుతుందా.? వాళ్ళు థియేటర్స్ కి వస్తారా.? అన్న అనుమాలను బద్దలు కొట్టేలా సాయంత్రం షోస్ నుంచే సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. కృష్ణ జిల్లాలో నిన్న సాయంత్రం వేసిన రెండు షోస్ కే 2 లక్షల 35 వేల షేర్ వసూలు చేసింది. మ్మిగాతా ఏరియాల్లో కూడా ఇదే రేంజ్ కలెక్షన్స్ ఉన్నాయని సమాచారం. కమల్ హాసన్ హీరోగానే కాకుండా కథ – స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి రమేష్ అరవింద్ డైరెక్టర్. ఒక సినీ నటుడు జీవితం చుట్టూ తిరిగే ఈ కథలో రియల్ లైఫ్ మూవీ లెజెండ్స్ అయిన బాల చందర్, కె.విశ్వనాధ్ లు నటించారు. కమల్ హాసన్ సరసన పూజ కుమార్, ఆండ్రియా జెరెమియా హీరోయిన్స్ గా నటించారు. జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు.

తాజా వార్తలు