కమల్ హాసన్ ‘ఉత్తమ విలన్’ రిలీజ్ డేట్

కమల్ హాసన్ ‘ఉత్తమ విలన్’ రిలీజ్ డేట్

Published on Feb 12, 2015 1:35 AM IST

Uttama-Villain
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమా ‘ఉత్తమ విలన్’. కమల్ హాసన్ ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ ని పూర్తి చేసారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ప్రసతుతం ఈ సినిమాకి సంబందించిన ఫైనల్ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ మరియు ఫైనల్ మిక్సింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా ఆడియో లాంచ్ ని మార్చి 1న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు కానీ కచ్చితమైన రిలీజ్ డేట్ ని మాత్రం అనౌన్స్ చెయ్యలేదు.

కానీ తాజాగా ఈ చిత్ర టీం ఉత్తమ విలన్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది. కమల్ హాసన్, అతని టీం ఈ సినిమాని ఏప్రిల్ 2న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. సంక్రాంతి కానుకగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యువ సంచనలనం జిబ్రాన్ మ్యూజిక్ అందించిన ఉత్తమ విలన్ ఆడియో రైట్స్ ని ఎరోస్ వారు ఫ్యాన్సీ అమౌంట్ కి సొంతం చేసుకున్నారు. ఇందులో కమల్ హాసన్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. అవే మలయాళంలో ఫేమస్ అయిన తెయ్యమ్‌ కళాకారుడిగా, మరొకటి సినిమా నటుడిగా కమల్‌హాసన్‌ కనిపిస్తాడు.

రమేష్ అరవింద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కె. బాలచందర్, పూజ కుమార్, ఆండ్రియా, పార్వతి, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తిరుపతి బ్రదర్స్ – రాజ్ కమల్ ఫిల్మ్స్ కలిసి నిర్మిస్తున్నారు. ఇది కాకుండా కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం 2’ సినిమా త్వరలో విడుదల కానుంది.

తాజా వార్తలు