ఈ నెల 15న ఉత్తమ విలన్ ట్రైలర్

ఈ నెల 15న ఉత్తమ విలన్ ట్రైలర్

Published on Jan 11, 2015 3:54 AM IST

Uttama-Villain
విలక్షణ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న ‘ఉత్తమ విలన్’ షూటింగ్ చివరిదశకు చేరుకుంటుంది. కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా రెండు విభిన్న కాలాల నడుమ తెరకెక్కిన కధనంతో రూపుదిద్దుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్ ఈ నెల 15న విడుదలకానుంది. ప్రస్తుతం లాస్ ఆంజిల్స్ లో సౌండ్ మిక్సింగ్ పనులు జరుగుతున్నాయి

ఈ సినిమాను కమల్ స్నేహితుడు రమేష్ అరవింద్ తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు స్వర్గీయ బాలచందర్ చివరిసారిగా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఆండ్రియా మరియు పూజా కుమార్ హీరోయిన్స్. తిరుపతి బ్రదర్స్ సమర్పణలో ఈ చిత్రం నిర్మాణమవుతుంది

తాజా వార్తలు