అభిమానులు, సినీ ప్రియులు ఎంత గానో ఎదురు చూస్తున్న ‘ఉత్తమ విలన్’ సినిమా తమిళ ట్రైలర్ నేడు ఇంటర్నెట్లో విడుదల చేశారు. కమల్ హాసన్ శక్తివంతమైన వాయిస్ ఓవర్ తో మొదలైన వీడియో ఆసక్తికరంగా సాగింది. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్లో తెయ్యమ్ కళాకారుడిగా, ప్రజెంట్ సూపర్ స్టార్ గా.. కేవలం 90 సెకన్ల వ్యవధిలో పలు వేషధారణలలో కమల్ హాసన్ నట విశ్వరూపం చూపారు.
ట్రైలర్లో ఒక జూనియర్ కళాకారుడుగా, ఫిల్మ్ మేకర్ గా, ఆలోచనాపరుడుగా, ఫిలాసఫర్ గా మరియు సోషలిస్ట్ గా ఒక నటుడి జీవితంలో పలు కోణాలు స్పృశించినట్టు అర్ధం అవుతుంది. ఆయా పాత్రలలో భావోద్వేగాలను కమల్ తెరపై చూపిన తీరు అద్బుతం. సినిమాలో కమల్ హాసన్.. తన నిజ జీవిత పాత్రను చూపించే ప్రయత్నం చేస్తున్నారేమో అనే భావన ప్రేక్షకులలో కలుగుతుంది. పునర్జన్మల నేపధ్యంలో ‘ఉత్తమ విలన్’లో కథ, కథనాలు ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. నటుడిగా తన కలలు నెరవేర్చుకోవడానికి తెయ్యమ్ కళాకారుడు మళ్లీ జన్మిస్తాడని చెప్తున్నారు.
జిబ్రాన్ సంగీతం, రమేష్ అరవింద్ దర్శకత్వం ట్రైలర్… కమల్ కథకు ప్రాణంగా నిలుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ట్రైలర్లో వారిద్దరూ ఆకట్టుకున్నారు. ఇది నిజం అవునో కాదో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఎదురు చూడక తప్పదు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


