మహేష్ బాబుని కలిసిన ముఖ్యమంత్రి !

మహేష్ యొక్క 25వ చిత్ర షూటింగ్ ఈరోజే ఉత్తరాఖాండ్ లోను డెహ్రాడూన్ లో మొదలైంది. మహేష్ తో సహా ఇతర ముఖ్య తారాగణం ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు. కళాశాల బ్యాక్ డ్రాప్లో జరుగుతున్న ఈ మొదటి షెడ్యూల్ సుమారు 20 రోజుల పాటు ఉండనుంది.

ఇదిలా ఉండగా ఉత్తరాఖాండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ స్వయంగా షూటింగ్ జరుగుతున్న సెట్స్ కి వెళ్లి మహేష్ బాబుని కలిశారట. దీన్ని బట్టి మహేష్ క్రేజ్ ఏపాటిదో అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ వార్త మహేష్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది.

‘భరత్ అనే నేను’ లాంటి సూపర్ హిట్ తర్వాత మహేష్ చేస్తున్న చిత్రం కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. దర్శకుడు వంశీ పైడిపల్లి కూడ ఈ సినిమా చేయడం కోసం చాలా రోజుల పాటు ఎదురుచూశారు. అశ్విని దత్, దిల్ రాజులు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతాన్ని అందిస్తున్నారు.