మాచో హీరో గోపీచంద్ నటించిన ‘లౌక్యం’ సినిమా ఇటీవలే విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఇది రిలీజ్ కాకముందే సెట్స్ పైకి వెళ్ళిన మరో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’ లాంటి సక్సెస్ఫుల్ సినిమాలను అందించిన యువి క్రియేషన్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
రాధాకృష్ణ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఈ సంవత్సరం చివరికల్లా షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అలాగే జనవరిలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి ఫిబ్రవరిలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం ప్రస్తుతం ఫిబ్రవరిలో పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారు.
గోపీచంద్ సరసన ‘ఊహలు గుసగుసలాడే’ ఫేం రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. గోపీచంద్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి అందరి నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మణిశర్మ తనయుడు సాగర్ మహతి ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు.


