మరో మూవీ చాన్స్ కొట్టేసిన అవికా గోర్

మరో మూవీ చాన్స్ కొట్టేసిన అవికా గోర్

Published on Apr 27, 2014 11:43 AM IST

Avika-Gor
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా అంధ్రప్రదేశ ప్రేక్షకులకు పరిచయమైన నార్త్ ఇండియన్ భామ అవికా గోర్. బుల్లితెరను మెప్పించిన అవిక గోర్ ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా తర్వాత అవిక ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాకి సైన్ చేసింది. తాజాగా ఈ భామ మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ కి సైన్ చేసింది.

మురళీధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ లవ్ ఎంటర్టైనర్ ని ‘మేం వయసుకు వచ్చాం’, ‘ప్రేమ ఇష్క్ కాదల్’ నిర్మించిన బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నాడు. అవికా గోర్ సరసన నూతన నటీనటులు నటించనున్నారు.

ప్రస్తుతం అవిక గోర్ నటిస్తున్న ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సినిమాలో నాగ సౌర్య హీరోగా నటిస్తున్నాడు. నంద్యాల రవి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని గిరిధర్ నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు