నాని మూవీ విడుదల వాయిదా..!

Published on Mar 14, 2020 12:52 pm IST

కరోనా వైరస్ కారణంగా ప్రపంచం కుదేలవుతున్న వేళ చిత్ర పరిశ్రమ మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. కరోనా కారణంగా పెద్ద సినిమాల విడుదల నిలిపివేస్తున్నారు. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్ళడానికి భయపడుతున్నారు. కాగా హీరో నాని ‘వి’ మూవీ విడుదల కూడా వాయిదాపడినట్లు తెలుస్తుంది. దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ ‘వి’ ఉగాది కానుగ ఈనెల 25న విడుదల కావాల్సివుంది.

ఐతే వైరస్ కారణంగా ఈ చిత్ర విడుదల వాయిదావేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఏప్రిల్ నెలలో కొంచెం ఈ వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టాక విడుదల చేయాలని భావిస్తున్నారట. దీనిపై అధికారిక ప్రకటన నేడు విడుదల చేశారు. ‘వి’ మూవీలో సుధీర్ పోలీస్ గా నటిస్తుండగా, నివేదా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More