కె.జి.ఎఫ్ స్థాయిలో ఇంకో సినిమాను తీసుకొస్తున్న వారాహి

కె.జి.ఎఫ్ స్థాయిలో ఇంకో సినిమాను తీసుకొస్తున్న వారాహి

Published on Jul 1, 2019 11:42 PM IST

ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ వారాహి ప్రొడక్షన్స్ కొన్ని రోజుల్ క్రితమే కన్నడ చిత్రం ‘కె.జి.ఎఫ్’ చిత్రాన్ని తెలుగులోకి అనువదించి ప్రాపర్ పెద్ద తెలుగు సినిమాను ఏ స్థాయిలో రిలీజ్ చేస్తారో అదే భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. ఆ చిత్రం ప్రేక్షకులను విశేషంగా అలరించి భారీ లాభాల్ని తెచ్చి పెట్టింది. దీంతో ఇంకో కన్నడ సినిమాపై కన్నేశారు వారాహి అధినేత సాయి కొర్రపాటి.

ఆ సినిమానే ‘పహిల్వాన్’. ఎస్.కృష్ణ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2500 స్క్రీన్లలో చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్ర తెలుగు హక్కుల్ని కొన్న వారాహి తెలుగులో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరి ‘కె.జి. ఎఫ్’ ఇచ్చిన సక్సెస్ ‘పహిల్వాన్’ కూడా ఇస్తుందేమో చూడాలి. తమిళం, హిందీ, మలయాళ పరిశ్రమల్లో కూడా అక్కడి డిస్ట్రిబ్యూటర్లు భారీ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు