100 మిలియన్ క్లబ్ లో విజయ్ సాంగ్.!

Published on Mar 21, 2021 4:36 pm IST

ఓ గుంపు కలిసి సూపర్బ్ గా ఎంజాయ్ చెయ్యాలి అంటే ఒక సరైన మాస్ సాంగ్ ఉండాల్సిందే. మరి అలాంటి సాంగ్స్ ఇటీవల కాలంలో మన దక్షిణాది నుంచి చాలానే వచ్చాయి. వాటిలో కోలీవుడ్ బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ “వాతి కమింగ్” కూడా ఒకటి. ఇళయ థలపతి విజయ్ హీరోగా లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబోలో వచ్చిన ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించాడు.

మరి ఈ సాంగ్ కు అప్పుడు లిరికల్ కు ఎంతైతే రెస్పాన్స్ వచ్చిందో అంతకు మించే ఫుల్ వీడియో సాంగ్ కు కూడా వచ్చింది. మరి అలా ఇటీవలే విడుదల కాబడిన ఈ సాంగ్ నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా వైరల్ అయ్యింది. ఫైనల్ గా ఇప్పుడు ఈ సెన్సేషనల్ సాంగ్ కేవలం ఒక్క నెలలో 100 మిలియన్ మార్క్ అందుకొని రికార్డ్ సెట్ చేసింది. అంతే కాకుండా 1.5 మిలియన్ లైక్స్ కూడా కొల్లగొట్టింది. మొత్తంగా మాత్రం ఈ సాంగ్ సెన్సేషన్ అప్పుడే ఆగేది కాదు అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :