‘వడచెన్నై’ తో ధనుష్ కు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ !

‘వడచెన్నై’ తో ధనుష్ కు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ !

Published on Oct 19, 2018 1:12 PM IST

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం ‘వడచెన్నై’ మొదటి భాగం ఇటీవల విడుదలై అద్భుతమైన రివ్యూస్ ను రాబట్టింది. ఇక ఈ చిత్రం మొదటి రోజు తమిళనాడు వ్యాప్తంగా రూ. 7కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి ధనుష్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఒక్క చెన్నై సిటీలోనే ఈచిత్రం మొదటి రోజు 81లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఫుల్ రన్ లో ఈ చిత్రం ధనుష్ కు కెరీర్ బెస్ట్ కల్లెక్షన్స్ ను అందించనుంది.

వెట్రి మారన్ దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేష్ , ఆండ్రియా కథానాయికలుగా నటించారు. ధనుష్ తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మించిన ఈచిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు