మన తెలుగు సినిమా దగ్గర ఒకప్పుడు ఉన్నటువంటి ఫ్యామిలీ స్టార్ హీరోస్ లో వడ్డే నవీన్ కూడా ఒకరు. అలా మంచి ఆదరణ ఉన్న తాను కొన్నాళ్ల పాటుగా సినిమా నుంచి మాయం అయ్యారు కానీ సోషల్ మీడియాలో మాత్రం తన క్రేజ్ అలానే ఉంది. ఇక ఫైనల్ గా తాను కంబ్యాక్ ఇస్తూ చేసిన లేటెస్ట్ చిత్రమే ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. దర్శకుడు కమల్ తేజ్ నార్ల తెరకెక్కించిన ఈ చిత్రంలో గ్లామరస్ బ్యూటీ రాశీ సింగ్ హీరోయిన్ గా నటించింది.
అయితే ఈ సినిమా తనకి అనుకున్న రేంజ్ లో కంబ్యాక్ హిట్ గా నిలవలేదు. ఇలా ఫైనల్ గా థియేటర్స్ నుంచి ఓటిటికి ఈ చిత్రం వచ్చేసింది. ఈ సినిమాని ప్రముఖ సంస్థ జీ 5 సంస్థ సొంతం చేసుకున్నారు. ఇక ఇందులో ఇవాళ్టి నుంచి అందుబాటులోకి వచ్చేసింది. మరి వడ్డే నవీన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ సినిమా చూడాలి అనుకునేవారు జీ 5 లో చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి కల్యాణ్ నాయక్ సంగీతం అందించగా వడ్డే నవీన్ నిర్మాణం వహించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
