వైష్ణవ్ తేజ్ తో క్రిష్ చిత్రం..నేడే ముహూర్తం.!

Published on Aug 14, 2020 12:25 pm IST

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన మరో యువ హీరో వైష్ణవ్ తేజ్. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు అయినటువంటి వైష్ణవ్ తేజ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తన డెబ్యూ మూవీ “ఉప్పెన” తో ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం ఇంకా విడుదలకు రెడీ అవుతుండగా వైష్ణవ్ ఇప్పుడు మన టాలీవుడ్ విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో ఓ చిత్రం చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ రోజే ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమం కూడా పూర్తయ్యినట్టు తెలుస్తుంది.

అలాగే ఈ సినిమాకు సంబంధించి ఇతర విషయాల్లోకి వెళ్లినట్టయితే ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనుందట. అలాగే ఈ ప్రాజెక్ట్ అప్పటి నుంచో అనుకున్నది కావడంతో క్రిష్ కు ఇప్పుడు సమయం కూడా దొరకడం మూలాన ఈరోజు ముహూర్తం ఫినిష్ చేసి రేపటి నుంచే షూటింగ్ ఆరంభించి సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చెయ్యాలని భావిస్తున్నారట. అయితే ఇప్పుడు పవన్ తో క్రిష్ చేస్తున్న ప్రాజెక్ట్ కు ఇంకా సమయం ఎక్కువ ఉన్నందున ఎప్పుడు నుంచో అనుకుంటున్నా ఈ ప్రాజెక్ట్ ను ఆ లోపు పూర్తి చెయ్యాలని ఫిక్స్ అయ్యినట్టు సమాచారం.

సంబంధిత సమాచారం :

More