వైష్ణవ్ ఆల్ టైం రికార్డ్ కొట్టబోతున్నాడా.?

వైష్ణవ్ ఆల్ టైం రికార్డ్ కొట్టబోతున్నాడా.?

Published on Feb 14, 2021 8:17 PM IST


మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన మరో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో వైష్ణవ్ తేజ్. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్ తన డెబ్యూ ఎంపిక చాలా బాగా చేసుకున్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన తో చేసిన లేటెస్ట్ ఫిల్మ్ “ఉప్పెన” అంచనాకు మించే వసూళ్లను రాబట్టుతుండడంతో ఇప్పటి ఏ డెబ్యూ హీరో సినిమాకు కూడా రాని వసూళ్లు వైష్ణవ్ కు వచ్చినట్టు అయ్యింది.

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, దేవిశ్రీ అమేజింగ్ మ్యూజిక్, కృతి శెట్టి ఇలా అన్ని అంశాలు కలిసి రావడంతో ఈ చిత్రంతో వైష్ణవ్ కు సాలిడ్ వెల్కమ్ దక్కింది అని చెప్పాలి. ఓపెనింగ్ రోజు వసూళ్లు నుంచి ఈ సండే వరకు ఖచ్చితంగా ఈ సినిమా 20 కోట్లకు పైగా మార్క్ ను సింపుల్ గా క్రాస్ చేసేస్తోంది అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన తన “చిరుత” ఇప్పటి వరకు ఓ డెబ్యూ హీరో చిత్రాల్లో అత్యధిక షేర్ ను రాబట్టింది మరి ఆ మార్క్ ను ఇపుడు వైష్ణవ్ కన్ఫర్మ్ గా క్రాస్ చేస్తాడని తెలుస్తుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 18 కోట్లకు పైగా షేర్ ను రాబట్టిన ఈ చిత్రం 25 కోట్ల షేర్ మార్క్ ను అందుకోవడం పెద్ద కష్టం కాదని తెలుస్తుంది. మరి వైష్ణవ్ ఆ ఆల్ టైం రికార్డు మార్క్ ను ఎప్పుడు క్రాస్ చేస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు