మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టేలా ఉన్నాడు !

Published on Feb 20, 2020 3:12 pm IST

మెగా మేనల్లుడు వైష్ణ‌వ్‌ తేజ్ ‘ఉప్పెన’ అనే చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవ్వబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో వైష్ణ‌వ్‌ తేజ్ లవ్ ట్రాక్ తో పాటు సెకెండ్ హాఫ్ లో వచ్చే ప్రీ క్లైమాక్స్ లోని ఎమోషనల్ సీక్వెన్స్ కూడా మొత్తం సినిమాలోనే హైలైట్ గా నిలుస్తోందట. ముఖ్యంగా విజయ్ సేతుపతి – వైష్ణ‌వ్‌ తేజ్ మధ్య కాన్ ఫ్లిక్ట్ కూడా చాల బాగుంటుందని తెలుస్తోంది. మొత్తానికి ఈ మెగా హీరో మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టేలా ఉన్నాడు.

కాగా ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదల కానుంది. వైష్ణ‌వ్‌ తేజ్ తో పాటు నూతన దర్శకుడు బుచ్చిబాబు సానాను దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అయితే విలక్షణ నటుడిగా విజయ్ సేతుపతి ఈ మూవీలో హీరోయిన్ కి తండ్రిగా అలాగే విలన్ పాత్రలో కనిపించనున్నాడట.

‘రాక్ స్టార్’ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించనున్నారు. అలాగే ‘రంగస్థలం’ ఫేమ్ రామకృష్ణ మౌనిక ఆర్ట్ డిపార్ట్ మెంట్ ను చూసుకుంటుండగా… నవీన్ నూలి ఎడిటర్ గా చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :