“వకీల్ సాబ్”కు అనుకున్న స్థాయిలో జరగడం లేదా.?

Published on Feb 9, 2021 5:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. శ్రీరామ్ వేణు తెరకెక్కించిన ఈ చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి. అయితే ఇదంతా ఆ మధ్యన బాగానే ఉన్నా ఇప్పుడు ఎందుకో కాస్త పరిస్థితి మారినట్టు అనిపిస్తుంది. పవన్ కం బ్యాక్ సినిమా అనగానే ఓ రేంజ్ హైప్ వచ్చినప్పటికీ టైం గడుస్తున్నా కొద్దీ అనుకున్న స్థాయిలో సినిమాకు పనులు జరగనట్టు అనిపిస్తుంది.

పనులు అంటే సినిమా పనులు కాదు ప్రీ రిలీజ్ బిజినెస్ పనులు. వకీల్ సాబ్ తో రేస్ లో ఉన్న అనేక సినిమాల బిజినెస్ లెక్కలు బాగానే వినిపిస్తున్నాయి కానీ ఈ సినిమాకు మాత్రం ఇంకా పెద్దగా చప్పుడే లేదు. అయితే దీనికి అంత స్థాయిలో ఆఫర్స్ రావడం లేదనే టాక్ వినిపిస్తుంది.

అలాగే ఇదే అభిప్రాయంలో ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఆల్రెడీ రెండు సార్లు ఉన్నా సినిమాకు ఓవర్ గా అమ్మినా కరెక్ట్ కాదని మినిమం బిజినెస్ జరిగినా చాలని అనుకుంటున్నారు. మరి బహుశా అందుకే ఈ సినిమా ఏ స్థాయి బిజినెస్ జరుగుతుంది అన్నది ఇంకా బయటకు రాలేదు.

సంబంధిత సమాచారం :