“వకీల్ సాబ్” నైజాం డే 1 సాలిడ్ వసూళ్లు.!

Published on Apr 10, 2021 2:02 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్” నిన్ననే విడుదలై భారీ హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కేవలం ఒక్క పవన్ అభిమానులు నుంచే కాకుండా అన్ని వర్గాల నుంచి యూనానిమస్ టాక్ ఈ చిత్రానికి వచ్చింది. అలాగే భారీ ఎత్తునే విడుదల కాబడిన ఈ చిత్రం అంతే స్థాయి ఓపెనింగ్స్ ను రాబట్టడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేసాయి.

మరి అలా ఇప్పుడు పి ఆర్ టీం నుంచి ఒక్కో ఏరియా వారీగా వకీల్ సాబ్ వసూళ్లు బయటకు వస్తున్నాయి. అలా ఈ చిత్రానికి సంబంధించిన డే 1 నైజాం వసూళ్లు ఇప్పుడు బయటకు వచ్చాయి ఈ చిత్రానికి గాను ఒక్క నైజాం ఏరియాలోనే భారీ మొత్తంలో 8.7 కోట్లు షేర్ రాబట్టినట్టు తెలుస్తుంది. మరి ఇప్పటికే మంచి టాక్ వచ్చింది పైగా పవన్ కు సరైన హిట్ కూడా వచ్చి చాలా కాలం అయ్యింది. సో ఈ వీకెండ్ కి కూడా గట్టి వసూళ్లు రాబట్టేయడం ఖాయం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :