‘వకీల్ సాబ్’ ఐదు రోజుల వసూళ్ల లెక్కలు

Published on Apr 14, 2021 8:47 pm IST

పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రం వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా రెండు, మూడవ రోజు మంచి వసూళ్లు సాధించింది. సోమవారం కొద్దిగా నెమ్మదించిన ఈ చిత్రం మంగళవారం మంచి రన్ అందుకుంది. ట్రేడ్ వర్గాల లెక్కల మేరకు ఐదవ రోజు చిత్రం నైజాంలో 3.04 కోట్లు, సీడెడ్లో 1.78 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.12 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 54 లక్షలు, వెస్ట్ గోదావరిలో 34 లక్షలు, గుంటూరులో 60 లక్షలు, కృష్ణాలో 61 లక్షలు, నెల్లూరులో 28 లక్షలు కలిపి మొత్తంగా 8 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.

గత నాలుగు రోజుల వసూళ్ళతో కలుపుకుంటే మొత్తం షేర్ రూ. 65 కోట్లకు చేరింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా, కర్ణాటక, ఓవర్సీస్ కలువుకుంటే ఆ మొత్తం రూ.72 కోట్ల వరకు ఉంది. ప్రీరిలీజ్ బిజినెస్ మేరకు చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవాలంట ఇంకో 25 నుండి 30 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఇక ఆరవ రోజైన ఈ బుధవారం సెలవు కావడంతో చాలా చోట్ల హౌస్ ఫుల్ రన్ దక్కించుకుంది చిత్రం. ఈ వారం, పై వారం చెప్పుకదగిన విడుదలలు లేకపోవడం సినిమాకు కలిసొచ్చే అంశం. ట్రేడ్ వర్గాలు ఈ వారం ముగిసేనాటికి సినిమా ఇంకో 17 నుండి 20 కోట్ల వరకు రాబట్టవచ్చని అంచనా వేస్తున్నాయి.

సంబంధిత సమాచారం :