“వకీల్ సాబ్” షూట్ అప్పటి నుంచి మొదలు.!

Published on Aug 14, 2020 4:17 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక మొదలు పెట్టిన మొదటి చిత్రం “వకీల్ సాబ్”. పింక్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే దీని తర్వాత లైన్ లో దర్శకుడు క్రిష్ తో ఒక భారీ పీరియాడిక్ డ్రామా కూడా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఇప్పుడు షూటింగ్స్ మళ్ళీ మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు దీనితో పవన్ కూడా మళ్ళీ షూటింగ్స్ లో పాల్గొనడం ఇప్పుడప్పుడే సాధ్యం కాదని తాను తెలిపారు. ఇదిలా ఉండగా క్రిష్, పవన్ తో చేస్తున్న ప్రాజెక్ట్ కు ఊహించని మలుపు వచ్చింది. దర్శకుడు క్రిష్ ఇంకా ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో ఉండగానే యువ హీరో వైష్ణవ్ తేజ్ తో ఓ ప్రాజెక్ట్ ను ఒప్పుకున్నారు.

దీనితో పవన్ చిత్రం ఏమైనట్టు అని డిస్కషన్ మొదలయ్యింది. కానీ ఇప్పుడు పవన్ ముందు ఒప్పుకున్న “వకీల్ సాబ్” చిత్రమే డిసెంబర్ లో షూటింగ్ మొదలు కానుందట. ఇక అది అవ్వాలి అప్పుడు మళ్ళీ క్రిష్ సినిమాలో జాయిన్ అవ్వాలి. అందుకు క్రిష్ ఈ గ్యాప్ లో సింగిల్ షెడ్యూల్ తోనే ఆ సినిమాను ముగించనున్నారు. ఇదే పవన్ సినిమాలపై ప్రస్తుతం ఉన్న క్లారిటీ.

సంబంధిత సమాచారం :

More