“వకీల్ సాబ్” శాటిలైట్ రైట్స్ ఆ టాప్ ఛానెల్ చెంతకు?

Published on Oct 28, 2020 5:30 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న నటించనున్న అనేక చిత్రాల్లో ఇపుడు మొదటి వరుసలో ఉన్న చిత్రం “వకీల్ సాబ్”. దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఈపాటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్ డౌన్ వల్ల ఆగాల్సి వచ్చింది.

కానీ గ్యాప్ లో ఊపందుకున్న ఓటిటి సంస్థలు ఫ్యాన్సీ ఆఫర్లనే దిల్ రాజు ముందు ఉంచగా దిల్ రాజు ఆ డీల్ కు నో చెప్పారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న తాజా టాక్ ప్రకారం ఈ చిత్రం తాలుకా శాటిలైట్ హక్కులు మన తెలుగు టెలివిజన్ టాప్ ఛానెల్స్ లో ఒకటైన జెమినీ టీవీ వారు సొంతం చేసుకున్నట్టుగా టాక్.

అలాగే ఈ హక్కులను కూడా వారు భారీ ధరకే కొనుగోలు చేసినట్టుగా వినికిడి. లేటెస్ట్ గానే సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న “సర్కారు వారి పాట” అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న “పుష్ప” శాటిలైట్ హక్కులు కూడా అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. ఇపుడు ఆ లిస్ట్ లో “వకీల్ సాబ్” కూడా చేరాడో లేదో అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More