“వకీల్ సాబ్” టీజర్ అప్పటికి ప్లాన్ చేస్తున్నారా.?

“వకీల్ సాబ్” టీజర్ అప్పటికి ప్లాన్ చేస్తున్నారా.?

Published on Dec 29, 2020 5:43 PM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం “వకీల్ సాబ్”. ఇప్పటికే భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. మరి చాలా కాలం తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో కం బ్యాక్ సాలిడ్ గా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అందుకు తగ్గట్టుగానే టీజర్ ను మోస్ట్ అవైటెడ్ గా మార్చుకుని దానితో భారీ రికార్డులు సెట్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. మరి టైం అవుతున్నా ఆరోజు కోసం చాలా మందే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం రానే వస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. మొదటగా కొత్త సంవత్సరం కానుకగా అనుకున్న ఈ టీజర్ ను సంక్రాంతికి షిఫ్ట్ చేసినట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది అయినా ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు