పవన్ దెబ్బకు ‘బాహుబలి 2’ రికార్డ్ బద్దలైంది

Published on Mar 29, 2021 10:00 pm IST

పవర్ స్టార్ సినిమా అంటే ఆ యుఫోరియానే వేరు. అభిమానుల్లో వెయ్యి రెట్ల ఉత్సాహం ఉంటుంది. అందుకే ఎన్ని పాన్ ఇండియా సినిమాలకు లేని క్రేజ్ పవన్ సినిమాలకు ఉంటుంది. అందునా పవన్ రీఎంట్రీ సినిమా అంటే ఆ క్రేజ్ చెప్పనక్కర్లేదు. ఏళ్ల తరబడి ఎదురుచూసిన అభిమానులు ‘వకీల్ సాబ్’ కోసం ఆతురతగా ఉన్నారు. వాళ్ళెంత ఈగర్ గా ఉన్నారు అనేది ట్రైలర్ హడావుడి చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ కోసం థియేటరాలకు పోటెత్తారు ప్రేక్షకులు. లాక్ డౌన్ తర్వాత థియేటర్లలోకి ఈ రేంజ్ క్రౌడ్ రావడం ఇదే తొలిసారి. అది కూడ ట్రైలర్ కోసం మాత్రమే. ఇక ట్రైలర్ విడుదలైన కొద్దిసేపట్లోనే పాత రికార్డులను తిరగరాస్తోంది.

ఇప్పటివరకు తక్కువ టైంలో అత్యధిక లైక్స్ సాధించిన ట్రైలర్ గా ‘బాహుబలి 2’ ఉండేది. ‘బాహుబలి -2’ పదిన్నర గంటల్లో 4 లక్షల లైక్స్ సాధిస్తే ‘వకీల్ సాబ్’ మాత్రం 71 నిముషాల్లోనే 4 లక్షల లైక్స్ టార్గెట్ కొట్టేసింది. ఇక 5 లక్షల లైక్స్ టార్గెట్ 115 నిముషాల్లోనే ఛేదించాడు పవన్. ఈ ఊపు చూస్తుంటే 24 గంటల్లో మిలియన్ లైక్స్ లక్ష్యాన్ని చేదించేలా కనిపిస్తోంది. మొత్తానికి పవన్ రీఎంట్రీ ఆరంభంలోనే అదిరిపోయింది. ఇక సినిమా విడుదలయ్యాక వసూళ్ల సునామీ ఎలా ఉంటుందో చూడాలి. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 9న భారీ ఎత్తున రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :