“వకీల్ సాబ్” తో టార్గెట్ “బాహుబలి 2” అట.!

Published on Mar 28, 2021 5:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా వేణు శ్రీరామ్ తెరకెక్కించిన నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “వకీల్ సాబ్”. లాస్ట్ మినిట్ లో భారీ హైప్ ను తెచ్చుకున్న ఈ చిత్రం కోసం పవన్ ఫ్యాన్స్ గట్టిగానే ఎదురు చూస్తున్నారు. మరి ఇదిలా ఉండగా రేపు విడుదల కానున్న ట్రైలర్ కోసం కూడా గట్టి టార్గెట్స్ పెట్టుకొనే ఎదురు చూస్తున్నారు.

ఇటీవల మన టాలీవుడ్ ట్రెండ్స్ లో టీజర్ కు దొరికినంత ఆదరణ ట్రైలర్స్ రావడంతో అది వ్యూస్ తో అయితేనేం లైక్స్ పరంగా చూసుకున్నా సరే ట్రైలర్స్ కు అంత రీచ్ లేదు. అయితే ఇందుకు మరో కారణం కూడా ఉంది. మేకర్స్ చాలా మేర జస్ట్ టీజర్ వరకునే ఆపేస్తున్నారు.

కానీ ఇప్పుడు వకీల్ సాబ్ నుంచి టీజర్ తో పాటుగా ట్రైలర్ కూడా వస్తున్న టైం లో హైయెస్ట్ ఏది అని చూస్తే లాస్ట్ టైం అత్యధిక లైక్స్ కొల్లగొట్టింది ప్రభాస్ తెలుగు “బాహుబలి 2″నే కనిపిస్తుంది. దీనితో ఆ టార్గెట్ మొత్తాన్ని వీరు వకీల్ సాబ్ ట్రైలర్ కు పెట్టుకున్నారు. ట్రైలర్ కు అయితే ప్రస్తుతానికి మంచి హైప్ ఉంది. మరి దీనికి ఏ స్థాయి రెస్పాన్స్ వస్తుందో తెలియాలి అంటే రేపు మార్చ్ 29 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :