‘వకీల్ సాబ్’కు అలా కలిసి వస్తోంది మరి

Published on Apr 15, 2021 3:00 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ మొదటిరోజే హిట్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లను సాధిస్తోంది. మొదటి ఐదు రోజులకు గాను 60 శాతానికి పైగా రికవరీ సాధించిన ఈ చిత్రం ఈరోజు కూడ హాలీడే కావడంతో మంచి రన్ కనబరిచే అవకాశం ఉంది. ఇదే స్థాయిలో గనుక సినిమా నడవగలిగితే ఇంకో వన్ వీక్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోగలడు పవన్ కళ్యాణ్. టికెట్ ధరల్లో తగ్గింపు, అదనపు షోల రద్దు లేకుండా ఉంటే వసూళ్లు ఇంకా మెరుగ్గా ఉండేవి. పైగా కరోనా భయం ఒకటి వెంటాడుతోంది. ఇది కూడ వసూళ్ల మీద ప్రభావం చూపిస్తోంది.

ఇన్ని కష్టాల నడుమ సినిమాకు ఒక ఊరట లభిస్తోంది. అదే లాంగ్ రన్ స్కోప్. ఈ ఏప్రిల్ నెలలో కొన్ని చెప్పుకోదగిన సినిమాలు విడుదలకావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ రీత్యా అవన్నీ వాయిదాపడుతున్నాయి. నాని నటించిన ‘టక్ జగదీష్’, రానా ‘విరాటపర్వం’, నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ వెనక్కు వెళ్లాయి. రేపో మాపో గోపీచంద్ ‘సీటిమార్’ కూడ వాయిదా వార్తతో వచ్చే అవకాశం ఉంది. దీంతో థియేటర్లలో ‘వకీల్ సాబ్’ మాత్రమే ఏకైక పెద్ద సినిమాగా నిలబడనుంది. ప్రేక్షకులకు మల్టిపుల్ ఛాయిసెస్ ఉంటే ‘వకీల్ సాబ్’ ఇబ్బందిపడాల్సి ఉండేది. కానీ రానున్న రెండు వారాల్లో ‘వకీల్ సాబ్’ ఒక్కటే ప్రేక్షకులకు ఏకైక ఛాయిస్ అయ్యేలా ఉంది. ఈ అంశం సినిమా వసూళ్లకు తప్పకుండా ఉపకరిస్తుంది.

సంబంధిత సమాచారం :