అందరికంటే ముందున్న వకీల్ సాబ్..!

Published on May 23, 2020 8:34 am IST

నిన్న ప్రభుత్వంతో చర్చల అనంతరం కొత్త సినిమాల షూటింగ్ పై ఓ స్పష్టత వచ్చింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో త్వరలోనే అన్ని చిత్రాల షూటింగ్స్ మొదలుకానున్నాయి. పరిమిత సిబ్బంది మరియు కొన్ని ఆంక్షల మధ్య షూటింగ్స్ యథావిధిగా జరగనున్నాయి. అలాగే కొన్నిరోజులలో థియేటర్స్ పునఃప్రారంభం కూడా ఉండనుంది. కాగా టాలీవుడ్ నుండి థియేటర్స్ లో దిగనున్న మొదటి స్టార్ హీరో పవన్ కల్యాణే.

ఆయన నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. కేవలం కొన్ని సన్నివేశాలు మరియు ఓ సాంగ్ చిత్రీకరణ మిగిలివుంది. కావున థియేటర్స్ ఓపెన్ చేసిన వెంటనే విడుదలయ్యే మొదటి సినిమా వకీల్ సాబ్ అవుతుంది. ఐతే వి, అరణ్య, నిశ్శబ్దం వంటి బడా చిత్రాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక హిందీ హిట్ మూవీ పింక్ రీమేక్ గా వస్తున్న ఈ మూవీని దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో పవన్ లాయర్ రోల్ చేస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More