వాల్మీకి ఎలా ఉంటాడో శాంపిల్ చూస్తారా?

Published on Aug 13, 2019 11:38 am IST

వరుణ్ తేజ్ ని దర్శకుడు హరీష్ శంకర్ మాస్ విలన్ అవతార్ లో ప్రెజెంట్ చేయనున్నాడు. ‘వాల్మీకి’ చిత్రంలో వరుణ్ ఇంతకు ముందెన్నడూ చేయని ఓ వైవిధ్యమైన పాత్ర చేయనున్నారు. ఉంగరాల జుట్టు, బాగాపెరిగిన గడ్డం,కళ్ళకు కాటుక,మేడలో రుద్రాక్షలతో ఉన్న ఆయన లుక్ చిత్రంపై అంచనాలు పెంచేసింది. ఈ మూవీలో వరుణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా, 14రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట,గోపి చంద్ ఆచంట నిర్మిస్తున్నారు.

కాగా ఈ మూవీ టీజర్ డేట్ ని నేడు ప్రకటించడం జరిగింది. ఈనెల 15న స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఈ మూవీ టీజర్ ని విడుదల చేస్తున్నట్లు నేడు ప్రకటిస్తూ ఓ పోస్టర్ ని విడుదల చేశారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ అక్టోబర్ లో విడుదల అయ్యే అవకాశం కలదు. వాల్మీకి చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :