ప్రీ టీజర్ తో ఆకట్టుకుంటున్న ‘వాల్మీకి’ !

Published on Jun 24, 2019 5:34 pm IST

హరీష్ శంకర్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ నటిస్తున్న ‘వాల్మీకి’ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా ప్రీ టీజర్ విడుదల అయింది. ఈ ప్రీ టీజర్ ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ మాస్ లుక్ అండ్ హరీష్ శంకర్ టేకింగ్ ప్రీ టీజర్ ను మరో స్థాయిలో నిలబెట్టింది. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘జిగర్తాండ’కు ఇది తెలుగు రీమేక్‌ కావడంతో ప్రేక్షకుల్లో కూడా సినిమా పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ లుక్ సినిమా పై ఆసక్తిని మరింత పెంచింది. కెరీర్ ప్రారంభం నుండి వరుణ్ వైవిధ్య‌మైన క‌థా చిత్రాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నాడు. రీసెంట్ గా ‘ఎఫ్‌2’తో మంచి హిట్ అందుకున్న వరుణ్ కెరీర్ కి ఈ చిత్రం చాలా ముఖ్యమైనది. మరి సక్సెస్ కోసం చాల గ్యాప్ తీసుకున్న హరీష్ శంకర్ వరుణ్ కి ఏ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి.

సెప్టెంబర్ 6వ తేదీన విడుదలకానున్న ఈ చిత్రంలో ఆత్రవ మురళి, పూజా హెగ్డేలు కీలక పాత్రలు చేస్తున్నారు. 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రీ టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం :

X
More