న్యూయార్క్ లో మహేష్ సినిమా కోసం రంగం సిద్దమవుతోంది !

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర కథ ఎక్కువ భాగం అమరికలో నేపథ్యంలో నడిచేది కావడంతో చిత్రీకరణను అక్కడి నుండే మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే దర్శకుడు వంశీ పైడిపల్లి సినిమాటోగ్రఫర్ కె.యు. మోహన్ తో కలిసి లొకేషన్లు వెతికే పనిలో బిజీగా ఉన్నారు.

మరోవైపు దేవి శ్రీ ప్రసాద్ కూడ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టారు. ఇటీవలే ‘భరత్ అనే నేను’ తో భారీ సక్సెస్ అందుకున్న మహేష్ బాబు కూడ కుటుంబంతో కలిసి వెళ్లిన వెకేషన్ పూర్తవగానే ఈ చిత్ర పనుల్లో పాల్గొననున్నారు. మే నెలాఖరు లేదా జూలై ఆరంభంలో మొదలుకానున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయకిగా నటించనుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్విని దత్ లు సంయుక్తంగా నిర్మించనున్నారు.

Exit mobile version