జాతీయ పురస్కారం వారికే అంకితం అన్న వంశీ.!

Published on Mar 23, 2021 9:00 am IST

నిన్ననే జాతీయ స్థాయి పురస్కారాల జాబితా విడుదల కాబడిన సంగతి తెలిసిందే. అందులో తెలుగు నుంచి సూపర్ స్టార్ మహేష్ నటించిన “మహర్షి” మరియు నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “జెర్సీ” చిత్రాలు పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే.

మరి ఇదిలా ఉండగా మహర్షి సినిమాకు నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంలో చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి ఆ అవార్డును తెలుగు ఆడియెన్స్ కు మరియు తన మొత్తం మహర్షి యూనిట్ కు అంకితం చేస్తున్నాని మీడియా ముఖంగా తెలియజేసారు.

మేము ఓ కమర్షియల్ చిత్రాన్ని మెసేజ్ తో తీస్తే దానిని తెలుగు ప్రేక్షకులే విజయవంతం చేసారని అందుకే వారికి ఈ జాతీయ పురస్కారాన్ని అంకితం చేస్తున్నానని వంశీ పైడిపల్లి తెలిపారు.

అంతే కాకుండా ఈ చిత్రానికి సంబంధించి మేజర్ క్రెడిట్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారికే దక్కుతుందని కూడా వెల్లడించారు. మరి ఈ స్వింగ్ లోనే ఈ కాంబో నుంచి మళ్ళీ ఓ సినిమా అనౌన్సమెంట్ రావాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :