మహేష్ పంపిన ఆసక్తికర మెసేజ్ షేర్ చేసిన వంశీ పైడిపల్లి.!

Published on Mar 23, 2021 1:46 pm IST

మన తెలుగు సినిమా నుంచి సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి మరియు నాచురల్ స్టార్ నాని నటించిన “జెర్సీ” సినిమాలకు నేషనల్ అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో రెండు చిత్రాల తాలూకా చిత్ర యూనిట్లు తమ సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇదిలా ఉండగా మహర్షి చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి ఆనందం అయితే వేరే స్థాయిలో వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ సందర్భంగా మహేష్ తో ఒకప్పుడు జరిపిన కన్వర్జేషన్ ను షేర్ చేసారు. 2017లో తీసిన “ఊపిరి” సినిమా విజయానికి గాను మహేష్ వంశీ కి పంపిన మెసేజ్ తాలూకా స్క్రీన్ షాట్ ను షేర్ చేసారు. ఆ సినిమాకు గాను ఫిలిం ఫేర్ రావడం ఆనందంగా ఉందని ఆ తర్వాత సినిమా జాతీయ స్థాయి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాని మహేష్ వంశీకి మెసేజ్ చేసారు.

అంతే కాకుండా తమ ప్రాజెక్ట్ కు ఏది అవసరం అయినా తానున్నాని భరోసా కూడా మహేష్ ఇచ్చారు. ఇప్పుడు అదే 2017లో మాటలు మహర్షి సినిమాకు వచ్చిన గుర్తింపుతో షేర్ చేసుకొని మహేష్ మాటలు నిజం అయ్యినట్టుగా తన ఆనందం వ్యక్తం చేశారు. మరి ఈ కాంబో నుంచి మళ్ళీ సినిమా ఎప్పుడు పడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :