చరణ్ తో కాదు బన్నీతో అట ?

Published on Feb 28, 2021 8:33 pm IST

‘మహర్షి’తో డైరెక్టర్ వంశీ పైడిపల్లికి సూపర్ హిట్ రావడంతో ఆయన తరువాత సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. మొదట వంశీ తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టేసారు. ఈ లోపు పరుశురామ్ తో సర్కారు వారి పాట అంటూ మహేష్ సినిమా మొదలెట్టేసాడు. దాంతో వంశీ తన తరువాత సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. మళ్ళీ చరణ్ తో కాదు, అల్లు అర్జున్ తో చేస్తున్నాడు అన్నారు.

పైగా బన్నీ కూడా వంశీతో సినిమాకి ఒప్పుకున్నాడని రూమర్స్ వినిపించాయి. మరి ఈ రూమర్స్ లో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం వంశీ పైడిపల్లి, బన్నీకి ఫుల్ స్క్రిప్ట్ వినిపించాడని.. బన్నీ కూడా కథ విని బాగుందని చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే అల్లు అరవింద్ కి కూడా కథ చెప్పాల్సి ఉంటుందట. ఈ సినిమా పూర్తిస్థాయి ఎమోషనల్ యాక్షన్ చిత్రంగా ఉండబోతోందట. మరి వంశీ – బన్నీ కాంబినేషన్ అంటే.. ఆ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి.

సంబంధిత సమాచారం :