తరుణ్ భాస్కర్ కు జోడి కుదిరింది !

Published on May 10, 2019 3:55 pm IST

యంగ్ హీరో విజయ్ దేవరకొండతో ‘పెళ్లి చూపులు’ అనే సినిమా ను తెరకెక్కించి ఓవర్ నైట్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఇక ఈ చిత్రం తరువాత అంతా కొత్త వాళ్ళతో ‘ఈనగరానికి ఏమైంది’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఈచిత్రం అంచనాలను అందుకోలేకపోయింది.

దాంతో ఇప్పుడు ఈడైరెక్టర్ హీరో అవతరమెత్తనున్నాడు. విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ లో తరుణ్ భాస్కర్ హీరోగా పరిచయం కానున్నాడు. ఇక ఈ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ వాణి భోజన్ హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో ఆమె కు ఇదే మొదటిసినిమా. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

సంబంధిత సమాచారం :

More