‘నారప్ప’ రిలీజ్.. అభిమానులు ఒప్పుకోవట్లేదు

Published on Jun 29, 2021 8:20 pm IST

విక్టరీ వెంకటేష్ కొత్త చిత్రం ‘నారప్ప’. తమిళ సూపర్ హిట్ మూవీ ‘అసురన్’కు ఇది రీమేక్. వెంకీ ఏరి కోరి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. మేకోవర్ నుండి సన్నివేశాల్లో పెర్ఫెక్షన్ వరకూ ప్రతిదీ ఖచ్చితంగా ఉండేలా చూసుకున్నారు. ఫస్ట్ లుక్ చూసి అభిమానులు థ్రిల్ ఫీలయ్యారు. ఈ సినిమా వెంకటేష్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని భావించారు. నారప్పగా వెంకీ నటనను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కానీ కరోనా కారణంగా సినిమా హాళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయో క్లారిటీ లేకుండా పోయింది. తెరుచుకున్నా తగ్గినా టికెట్ ధరలతో థియేటర్లు నడపగలమా లేదా అనే సందేహంలో ఉన్నారు ఎగ్జిబిటర్లు. దీంతో చిత్ర నిర్మాత సురేష్ బాబు సినిమాను ఓటీటీకి అమ్మేయాలని డిసైడ్ అయ్యారట. అమెజాన్ ప్రైమ్ సినిమా హక్కులు కొనుగోలుచేసిందనే టాక్ కూడ నడుస్తోంది. ఈ సంగతి తెలిసిన అభిమానులు కొందరు ‘నారప్ప’ ఓటీటీ ద్వారా విడుదలకావడం తమకు ఇష్టం లేదని అంటున్నారు. వెంకీ అద్భుతమైన నటనను వెండితెర మీదనే చూడాలని అనుకుంటున్నామని, ఆలస్యం అయినా పర్వాలేదు ఎదురుచూస్తామని సురేష్ బాబును రిక్వెస్ట్ చేస్తున్నారు. కొందరైతే ఒక్క రోజు నిరాహారదీక్ష కూడ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :